Saturday, May 11, 2024

తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలి

spot_img

సీఎం కేసీఆర్ .. ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్టం సాధించి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత  సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాలలో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని,అందరూ ప్రజా ప్రతినిధులు, అధికారులతో  కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. జూన్ 2వ తేదీన అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ.. ప్రారంభం అయ్యే ఉత్సవాలు జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ,అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు తెలిపారు మంత్రి. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించి…తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలన్నారు.

రాష్ట్రం రాక ముందు.. వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రైతు వేదికల దగ్గర ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు లాగే వికారాబాద్ జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల  చిరకాల వాంఛ నెరవేరిందని, అదే విధంగా నూతన మండలాలు,నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందని అన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటైన వికారాబాద్ జిల్లా కేంద్రంలో సంబురాలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతితో జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల వృత్తుల వారికి అండగా నిలవాలని  సీఎం కేసీఆర్ నిర్ణయించి.. ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అందజేయాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Latest News

More Articles