Friday, May 3, 2024

హరీష్ రావు కృషికి దక్కిన ఫలితం.. సిద్ధిపేట రైతులు హర్షం

spot_img

యాసంగి పంటకు నీళ్లు లెక ఆందోళనలో ఉన్న రైతుల బాధను చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహాయం చేశారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్వయంగా కలిసి నీటిని విడుదల చేయాలనీ లేఖ ఇచ్చారు. అయినా మంత్రి నుండి సరైన స్పందన లేకపోవటంతో ఫోన్ ద్వారా ఉత్తమ్ కి రైతుల బాధను వివరించారు హరీష్ రావు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి అధికారులతో చర్చించారు. రంగనాయక సాగర్ లోకి అంతగిరి రిజర్వాయర్ నుండి గురువారం ఉదయం 8:30 కి నీటిని పంపింగ్ చేసి.. ఒక పంప్ ద్వారా నీటిని విడుదల చేశారు.

ఇలాగే 3 రోజుల పాటు రంగనాయక సాగర్ లోకి నీటిని పంపింగ్ చేస్తారు. దీంతో యాసంగి పంటకు త్వరలో కాలువల ద్వారా నీళ్లు అందనున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రితో పాటు యాసంగి పంటకు నీళ్ల కోసం హరీష్ రావు పడిన శ్రమ గొప్పదని కొనియాడారు. ఇక గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చెప్పట్టినప్పటి నుండి గత మూడు సంవత్సరాల నుండి రంగనాయక సాగర్ ద్వారా యాసంగి పంటకు రైతులకు నీళ్లు ఇవ్వాగా.. ఈ సారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉండే… దానితో మూడు సంవత్సరాలనుండి పంట దిగుబడి పెరగడం తో రైతులు ఆందోళన లో ఉన్నారు.

Latest News

More Articles