Friday, May 3, 2024

రాముడితో రాజకీయం.. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్.. బీజేపీకి బ్రహ్మాస్త్రం

spot_img

రామమందిర ఓపెనింగ్ విషయంలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా అని దేశరాజకీయాల్లో చర్చ నడుస్తుంది. హిందుత్వ సెంటిమెంట్ ని అత్యంత శక్తివంతంగా ఉపయోగిస్తు విజయాలు సాధిస్తుంది బీజేపీ. ఇందులో భాగంగానే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. హిందుత్వ సెంటిమెంట్ దుర్వినియోగం విషయంలో బీజేపీపై చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నా.. రామమందిర ప్రారంభోత్సవం మాత్రం దేశప్రజల్లో ఒక బలమైన సెంటిమెంట్ ని క్రియేట్ చేయటంలో బీజేపీ విజయవంతమైంది. దేశంలోని ప్రతిపౌరుడు ఇప్పుడు రామ మందిరాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్ళమని సంచలన ప్రకటనచేసింది.

ఈ నిర్ణయంతో బీజేపీ ట్రాప్ లో కాంగ్రెస్ ఇరుక్కుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూన్నాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని బీజేపి పెద్దలు రాజకీయంగా వాడుకుంటున్నా.. కాంగ్రెస్ దీన్ని పొలిటికల్ అంశంగా చూడాల్సింది కాదు. రాముడిని దర్శించుకోవడం సగటు హిందువుల బలమైన కోరిక. ఇప్పుడు కాంగ్రెస్ ఇలా చేయటంతో రాముడికి రాహుల్ గాంధీ వ్యతిరేకమా.. రామమందిర ప్రారంభోత్సవం కాంగ్రెస్ కి ఇష్టం లేదంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్రాపగాండా షురూ చేసింది. రామ మందిరానికి వెళ్ళకపోవడం అనేది కాంగ్రెస్ చారిత్రక తప్పిదం అని.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నెత్తిన కాంగ్రెస్ పాలు పోసినట్టే అని.. ఇదంతా కాంగ్రెస్ హై కమాండ్ తెలివితక్కువ నిర్ణయమే అంటున్నారు విశ్లేషకులు.

Latest News

More Articles