Friday, May 3, 2024

‘సీఆర్‌పీఎఫ్‌’కు నాగార్జున సాగర్​ ప్రాజెక్ట్​ బాధ్యతలు

spot_img

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు సీఆర్పీఎఫ్ బలగాలు నాగర్జున సాగర్ చేరుకున్నాయి. ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా రైట్ కెనాల్ సమీపంలో ఉన్న రెడ్ బ్యాంక్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్న సీఆర్‌పీఎఫ్‌ కేంద్ర బలగాలు ప్రాజెక్ట్‌పై ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి ఏపీ ఏకపక్షంగా నీటిని విడుదల చేయడం వివాదానికి కారణమైంది. ప్రాజెక్ట్ 13 గేటును ఆంధ్రా పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకుని కంచెలను ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. దీంతో గత రెండు రోజులుగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.

నీటి విడుదలను ఆపాలని  కృష్ణా రివర్‌ బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది.  రంగంలో దిగిన బోర్డు వెంటనే నీటి విడుదల ఆపేయాలని ఆదేశించింది. అటు కేంద్ర హోంశాక వివాదంపై స్పందించి ఇరు రాష్ట్రాలతో చర్చించింది. సీఆర్‌పీఎఫ్‌ బలగాల పహారాలో ప్రాజెక్టులు ఉంచటంతో పాటు.. కృష్ణా బోర్డు ఆదేశాల ఖచ్చితంగా అమలు జరిగేలా చూస్తామని ప్రకటించింది. దీంతో కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి.

Latest News

More Articles