Friday, May 3, 2024

అక్టోబరు1న ప్రజలంతా ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలి

spot_img

కందుకూరు మండల అభివృద్ధికి బాటలు వేస్తూ పెద్ద ఎత్తున నిధులతో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టే పనులకు శ్రీకారం చుట్టారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కందుకూరు మండలంలోని ఆయా గ్రామాలలో 12 కోట్ల రూపాయల నిధులతో సిసి రోడ్డులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులుకు, సొసైటీ గౌడాన్ నిర్మాణ పనులకు, ఫంక్షన్ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్, వాటర్ ట్యాంక్ల తో పాటు మొత్తం 64 పనులకు శంకుస్థాపనలు చేసారు.

ఈ సందర్భంగా ఊరూరా సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్న మంత్రి సేవలను కొనియాడారు. ఈ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కందుకూరు మండల రూపురేఖలు మారిపోనున్నాయన్నారు. అక్టోబరు ఒకటో తేదీన మెడికల్ కళాశాలకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు. దాంతో పాటు ఈ ప్రాంతం వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో రైలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని, ప్రజలందరి తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక పల్లె ప్రగతితో గ్రామాల్లో సమూల మార్పులు వచ్చాయని, స్వచ్ఛతకు నిలయాలుగా మారాయన్నారు. మన తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో అవార్డులు రావటమే అందుకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో 12 వేల 769 గ్రామపంచాయతీలలో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను సమకూర్చి, నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను,పల్లే ప్రకృతి వనాలు, ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలలో 1 వెయ్యి 329 కోట్ల 73 లక్షల వ్యయంతో వైకుంఠ దామాలను పూర్తి చేయటం జరిగిందన్నారు మంత్రి సబితా.

Latest News

More Articles