Friday, May 17, 2024

అప్పు కట్టలేదని మార్కెట్లో నగ్నంగా ఊరేగింపు

spot_img

అవసరానికి చాలామంది అప్పు చేస్తుంటారు. అయితే వారి అవసరాన్ని ఆసరగా చేసుకొని, అప్పు ఇచ్చిన వారు రెచ్చిపోతున్నారు. కొంతమంది ఇచ్చిన అప్పుకు రెట్టింతలు వసూలు చేస్తుండగా.. మరికొంత అప్పు తీర్చకపోతే దేనికైనా తెగిస్తున్నారు. తాజాగా అప్పుకట్టలేదని ఓ యువకుడిని.. నగ్నంగా ఊరేగించారు. ఈ ఉన్మాద ఘటన బీజేపీ డబుల్ ఇంజిన్ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

Read Also: నేడు రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ.. ఏ ప్రాంతాల వారికి ఎక్కడ ఇస్తారంటే..

నోయిడాకు చెందిన అమిత్ అనే యువకుడు నోయిడా ఫ్రూట్ మార్కెట్లో వెల్లుల్లి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అమిత్ నెల రోజుల క్రితం వ్యాపార నిమిత్తం అదే మార్కెట్లో ఉండే సుందర్ అనే ఫైనాన్షియర్ దగ్గర రూ. 5600 అప్పుగా తీసుకున్నాడు. కాగా.. మంగళవారం సుందర్ అప్పు తీర్చాలని అమిత్‎ను అడిగాడు. దాంతో అమిత్ రూ. 2500 ఇచ్చి, మిగతా డబ్బు చెల్లించడానికి కొంత సమయం అడిగాడు. టైం ఇవ్వడానికి ఒప్పుకోని సుందర్.. అమిత్‎ను తన కార్యాలయానికి తీసుకెళ్లి బంధించి, విపరీతంగా కర్రతో కొట్టాడు. అనంతరం అమిత్ బట్టలు ఊడదీసి, బయటకు తీసుకొచ్చి, మార్కెట్లో నగ్నంగా తిప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిటీ మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యుడైన సుందర్ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి, కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు.. 

Latest News

More Articles