Friday, May 3, 2024

దేశంలో ముగిసిన తొలి దశ పోలింగ్

spot_img

దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ(శుక్రవారం) తొలి దశ పోలింగ్ నిర్వహించారు. 13 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఇవాళ  పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల సంఘం నుంచి అందిన సమాచారం మేరకు రాత్రి 7 గంటల సమయానికి 60.03 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి దశలో త్రిపురలో ఒక్క లోక్ సభ స్థానం కోసం ఎన్నికలు జరగగా.. అత్యధికంగా 79.9 శాతం ఓటింగ్ జరిగింది.

పశ్చిమ బెంగాల్ లో మూడు లోక్ సభ స్థానాల కోసం ఎన్నికలు జరగ్గా, 77.57 శాతం ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. పుదుచ్చేరిలో 73.25 శాతం ఓటింగ్ జరిగింది. బీహార్ లో మొదటి విడతలో భాగంగా 4 ఎంపీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగ్గా, అత్యల్పంగా 47.49 శాతం ఓటింగ్ నమోదైంది. 2019లో తొలి దశ ఎన్నికల్లో 91 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగ్గా… 69.68 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈసారి ఓటింగ్ నమోదు తగ్గినట్లు కనిపించింది.

తొలి దశ పోలింగ్ సందర్భంగా మణిపూర్ లో కాల్పులు, ఘర్షణలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య చెదురుమదురు గొడవలు జరిగాయి. నాగాలాండ్ లో ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇవ్వడంతో ఆరు జిల్లాల్లో ఓటింగ్ నమోదు కాలేదు.

ఇది కూడా చదవండి: భువనగిరి గురుకుల హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై కేంద్రం సీరియస్‌

Latest News

More Articles