Saturday, May 4, 2024

యువతలో పెరిగన ధూమ,మద్యపానాల వాడకం పై WHO ఆందోళన.!

spot_img

కౌమారాదశలో ఉన్నవారిలో ఆల్కహాల్, ఈసిగరెట్లు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు డబ్య్లుహెచ్ ఓ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ శాఖ గురువారం నివేదికను విడుదల చేసింది. యూరప్, మధ్య ఆసియా, కెనడాలో 11,13,15 ఏండ్ల వయస్సుగల 2,80,000మంది యువకుల నుంచి సేకరించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీనివల్ల దీర్ఘకాలిక పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందులో 15ఏళ్లలోపు వారిలో 57శాతం మంది కనీసం ఒక్కసారైనా మద్యం సేవించారని..అబ్బాయిలతో పోలిస్తే బాలికల సంఖ్య 59శాతం ఉందని నివేదికలో వెల్లడించింది.

ఆరోగ్య సంస్థ మొత్తం మద్యపానం అబ్బాయిల్లో తగ్గిందని పేర్కొంది. కానీ బాలికలలో అది పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం వినియోగం విషయానికి వస్తే..గత 30 రోజుల్లో కనీసం ఒక్కసారైనా తగుతున్నట్లు వెల్లడైందని నివేదికలో పేర్కొంది. 5శాతం మంది బాలికలతో పోలిస్తే 11ఏళ్ల అబ్బాయిలలో 8శాతం మంది ఆ విధంగా ఉన్నట్లు నివేదించారు. కానీ 15ఏళ్ల వయస్సులోని 38శాతం మంది అమ్మాయి గత 30రోజుల్లో కనీసం ఒక్కసారైనా మద్యం తాగినట్లు ఆరోగ్యం సంస్థ చెప్పుకొచ్చింది.

దీనితో మద్యం నుంచి కలిగే హానితో పిల్లలు, యువకులను రక్షించేందుకు మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య సంస్థ యూరప్, మధ్య ఆసియాలోని అనేక దేశాలను సూచించింది. చిన్న వయస్సులోనే ఇలాంటి వ్యసనాలకు బానిసవ్వలవ్వడం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని తెలిపింది. అదే సమయంలో గంజాయి వినియోగం కొద్దిగా తగ్గిందని చెప్పిన ఆరోగ్య సంస్థ దీన్ని కేవలం 15ఏళ్ల వయస్సుకు చెందిన 12శాతం మంది మాత్రమే వినియోగిస్తున్నారని డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది.

ఇది కూడా చదవండి: నటి తమన్నాకు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నోటీసులు..!

Latest News

More Articles