Saturday, May 4, 2024

జైసల్మేర్ సమీపంలో కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.!

spot_img

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఓ గూఢచారి విమానం కూలిపోయింది. గురువారం ఉదయం రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో కుప్పకూలిండి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. సాధారణ శిక్షణాసమయంలో విమానం ప్రమాదానికి గురైనట్లు ఎయిర్ ఫోర్స్ తెలిపింది.

ఈ విమానం జైసల్మేర్ జిల్లా హెడ్ క్వార్ట్ర్స్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధని జాజియా గ్రామంలో కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, వైమానిక దళ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానాన్ని ఏఐఎఫ్‌ నిఘా, గూఢచారి కార్యకలాపాలు నిర్వహించేందుకు వినియోగిస్తున్నాట్లు తెలిపింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనపై కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ ఏర్పాటు చేసిందని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది.ప్రమాదం తర్వాత ఎయిర్ ఫోర్స్ నిఘా విమానం మంటల్లో చిక్కుకుంది. కొద్దిసేపటికే ఈ విమానం పూర్తిగా కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం ప్రాంతాన్ని సీల్ చేశారు.

ఇది కూడా చదవండి: యువతలో పెరిగన ధూమ,మద్యపానాల వాడకం పై WHO ఆందోళన.!

Latest News

More Articles