Saturday, May 4, 2024

నటి తమన్నాకు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నోటీసులు..!

spot_img

ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్ లను ఫెయిర్ ప్లే యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు ఈనెల 29న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తమన్నాచేసిన ఈపనికి తమకు కోట్లలో నష్టం వచ్చిందని ప్రసారహక్కులు ఉన్న వయాకమ్ ఫిర్యాదు చేసింది. దీంతో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అటు ఇదే కేసులో సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌కు కూడా పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 23న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన దూరంగా ఉన్నారు. తాను ఆ రోజున దేశంలో లేనని తెలిపారు. దీంతో తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకోవడానికి మరో తేదీని సూచించాలని నటుడు సంజయ్ దత్ ను పోలీసులు కోరారు. ఇప్పుడు ఈ కేసులో తమన్నా భాటియా ఏప్రిల్ 29న సైబర్ బ్రాంచ్ ముందు హాజరుకావాల్సి ఉంటుంది.ఐపీఎల్ 2024కి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్ చట్టవిరుద్ధ స్ట్రీమింగ్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు చాలా వెబ్‌సైట్‌లలో వచ్చాయి. దీనికి సంబంధించిన కేసు ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికే నడుస్తోంది. ఈ స్ట్రీమింగ్ కారణంగా వయాకామ్ కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూసింది.

ఇది కూడా చదవండి: కెన్యాలో వరదలు విధ్వంసం..38 మంది మృతి.!

Latest News

More Articles