Friday, May 3, 2024

ప్రపంచానికి మరో పెనుముప్పు..వేగంగా వ్యాపిస్తున్న జాంబీ డీర్ డిసీజ్..!!

spot_img

ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి దాదాపు అంతమైన వేళ…కొత్త కొత్త వైరల్ పుట్టుకొస్తున్నాయి. జాంబీ డీర్ డిసీజ్ వేగంగా విస్తరిస్తోంది. ఇది త్వరలోనే మానవులకు అంటుకోవడం ఖామంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు. దీనిపేరు క్రోనిక్ వేస్టింగ్ డిసిజ్. యునైటెడ్ స్టేట్స్, కెనడాలో జింకలలో ‘జోంబీ డీర్ డిసీజ్’ వేగంగా వ్యాపిస్తోంది. కెనడాకు చెందిన పరిశోధకులు ఈ మహమ్మారి మానవులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని షాకింగ్ వార్త చెప్పారు.

జోంబీ డీర్ అనే ఈ వ్యాధి దీర్ఘకాలిక వృధా వ్యాధి. ఇది జంతువులకు సోకి చంపే న్యూరోడెజెనరేటివ్ వ్యాధి. సరిగ్గా సమీకరించని ప్రోటీన్లను ప్రియాన్స్ అంటారు. అంటువ్యాధిగా మారిన ఈ ప్రియాన్లు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మెదడు, ఇతర అవయవాలలో స్థిరపడటంతో మెదడు ప్రభావితమవుతుంది. శరీరం జోంబీలాగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు డ్రూలింగ్, నత్తిగా మాట్లాడటం, బద్ధకం, ఖాళీ దృష్టిని కలిగి ఉంటాయి. ఈ వ్యాధి ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో జింకలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ వ్యాధికి జోంబీ డీర్ డిసీజ్ అని పేరు వచ్చింది.

జనవరి చివరి వారంలో రెండు కేసులు వెలుగు చూడటంతో దీనికి అడ్డుకట్టే వేసేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన జింకలు, దుప్పి, కణుజు, క్యారిబో వంటి వాటికి పరీక్షలు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రొటీన్లు సరైన ఆకారం సంతరించుకోకపోవడమే జాంబీ డీర్ డిసీజ్ కు కారణం. ఇది సోకిన తర్వాత ప్రియాన్స్ కేంద్ర నాడీ వ్యవస్థ గుండా ప్రయాణించి మెదడు కణజాలం, అవయవాల్లోకి వెళ్తుంది.  వ్యాధి సోకిన జింకలు చొంగకార్చుకోవడం, నడుస్తుండగా అదుపు తప్పి పడిపోవడం, ఉదాసీనంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కారణంగా ఈ డీసీజ్ కు జాంబీ డీర్ డిసీజ్ అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఇది జంతువుల్లో వెలుగుచూసినప్పటికీ మానవులకు సోకినట్లు ఎక్కడా నిర్దాణ కాలేదు.

ఇది కూడా చదవండి: స్నేహితుడి ప్రాణాలు తీసేలా చేసిన వంద రూపాయాలు..!!

Latest News

More Articles