Thursday, May 2, 2024

నిరుద్యోగులకు అలర్ట్..రేపటితో ముగియనున్న ఆర్ఆర్‎బి దరఖాస్తు ప్రక్రియ.!!

spot_img

నిరుద్యోగులకు అలర్ట్. అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకును అభ్యర్థులకు ముఖ్య సమాచారం ఇది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (RRB ALP 2024) రిక్రూట్‌మెంట్ కోసం కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ రేపు అంటే ఫిబ్రవరి 19న ముగించనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోలేకపోయిన ఆసక్తిగల అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీ వివరాలు:
RRB ALP 2024 వివిధ RRBల క్రింద మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలు భర్తీ చేయనున్నారు.

వయస్సు:
జూలై 1, 2024 నాటికి 18-30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు మాత్రమే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగి, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనార్టీ, ఈబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.250. మిగతా వారికి 500 రూపాయలు.

ఎంపిక ప్రక్రియ:
రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఐదు దశలను కలిగి ఉంటుంది. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1), రెండవ దశ (CBT 2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మెడికల్ ఎగ్జామినేషన్ (ME) ఉంటుంది.

జీతం?
ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం రూ. 19900, ఇది కాకుండా అలవెన్సులు ఉంటాయి. దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్- https://www.recruitmentrrb.in/#/auth/landing ఇదే.

ఇది కూడా  చదవండి: సూర్యపేటలో విషాదం..మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య..!!

Latest News

More Articles