Friday, May 3, 2024

లోక్‌సభ ఎన్నికల్లో 96.88 కోట్ల మందికి ఓటు అవకాశం

spot_img

త్వరలో లోక్‌సభ ఎన్నికలు-2024 జరగనున్నాయి. దీంతో భారత ఎన్నికల సంఘం ఇవాళ( శుక్రవారం) కీలక ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది అర్హత పొందనున్నారని తెలిపింది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 2 కోట్ల మంది యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారంది. ఓటు కోసం నమోదు చేసుకున్నారని తెలిపింది. కాగా గత లోక్‌సభ ఎన్నికలు-2019తో పోల్చితే నమోదైన ఓటర్ల సంఖ్య 6 శాతం వరకు పెరిగిందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ‘ఎక్స్’ వేదికగా ప్రకటన విడుదల చేసింది.

ఇది కూడా చదవండి:ఎస్బీఐలో కోటిన్న‌ర విలువైన బంగారం చోరీ

Latest News

More Articles