Thursday, May 2, 2024

యూపీఎస్సీ లో ఉద్యోగం రానోళ్లకు డిట్టో ఇన్సూరెన్స్‌ జాబ్‌ ఆఫర్‌

spot_img

యూపీఎస్సీ (UPSC) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఎంపిక కావడం మామూలు విషయం కాదు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఏటా లక్షల మంది సన్నద్ధమవుతుంటారు. కానీ, ఖాళీలు మాత్రం 1000కి అటు ఇటుగా మాత్రమే ఉంటాయి. ర్యాంకర్లను మినహాయిస్తే మిగిలినవారికి నిరాశ తప్పదు.

అలాంటివాళ్లు ఏళ్ల పాటు చేసిన శ్రమను చూసిన వారికి సానుభూతి కలగక మానదు. జీవితంలో కీలక సమయాన్ని పరీక్ష సన్నద్ధత కోసం వెచ్చించిన వాళ్లకు మరో మార్గంలో నడవడం అంత సులభమైన విషయం కాదు. అలాంటివారిని దృష్టిలోఉంచుకొని ‘డిట్టో ఇన్సూరెన్స్‌’ ప్రత్యేక నియామక ప్రక్రియను ప్రకటించింది. UPSC తృటిలో అవకాశం కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకువచ్చింది. వారు చేసిన కృషి, పట్టుదలకు గుర్తింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సంస్థలో జిరోదా సహ-వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్‌కు వాటాలున్నాయి.

యూపీఎస్సీకి సన్నద్ధమై చివరకు నిరాశ ఎదురైన వారికోసం ప్రత్యేక నియామక ప్రక్రియను రూపొందించినట్లు డిట్టో ఇన్సూరెన్స్‌ సహ-వ్యవస్థాపకుడు భాను హరీశ్‌ గుర్రం తెలిపారు. ‘‘ఏటా లక్షల మంది యూపీఎస్సీకి సిద్ధమవుతారు. కానీ, సుమారు 800 మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. దాదాపు 99 శాతం మంది విఫలమవుతారు. ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో 3-4 ఏళ్ల పాటు ప్రయత్నించినవారు నాకు తెలుసు. కేవలం యూపీఎస్సీనే కాదు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు, బ్యాంక్‌ పీఓలు, గేట్‌ విషయంలోనూ ఇంతే. వాళ్లు ఎంత కృషి చేస్తారో మాకు తెలుసు. అందుకే మాజీ యూపీఎస్సీ అభ్యర్థుల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ఎలాంటి అనుభవం లేకున్నా ఉద్యోగమిస్తాం’’ అని హరీశ్‌ ఎక్స్ లో పోస్ట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: అబద్ధాలలో రేవంత్ రెడ్డితో మల్లు భట్టివిక్రమార్క పోటీపడుతున్నారు

Latest News

More Articles