Thursday, May 2, 2024

ఓటీటీలోకి టిల్లు స్వ్కేర్..స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

spot_img

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ,హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. హిస్టరీ రిపీట్ కావడం కూడా సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లన్నతోనే అని పోస్టు కూడా చేసింది.

టిల్లు స్క్వేర్ మూవీ మార్చి 29న థియేటర్లలోకి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. 2024లో తెలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒక్కటిగా నిలిచింది ఈ మూవీ. 2022లో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్వ్కేర్ రూపొందింది. టిల్లు స్వ్కేర్ కు మల్లిక్ రామ్ డైరెక్టర్. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే కథ, స్క్రీన్ ప్లే సిద్దు జొన్నలగడ్డ అందించాడు.

ఇది కూడా చదవండి: భూపాలపల్లికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..!

Latest News

More Articles