Thursday, May 2, 2024

భూపాలపల్లికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..!

spot_img

మూడు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్ట్‌ అగ్రనేత సిరిపెల్లి సుధాకర్‌ అలియర్‌ శంకర్‌రావు మృతదేహం వారి స్వస్థలానికి చేరింది. ఆయన భార్య సుమన అలియాస్‌ రజిత భౌతికకాయం కూడా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చేరింది. వారిద్దరి అంత్యక్రియలను శుక్రవారం మధ్యాహ్నం నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. కాగా ఈనెల 16న బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య భీరక కాల్పులు జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర చరిత్రలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదేనని వెల్లడించారు పోలీసులు. కాగా, శంకర్‌రావుపై రూ.25 లక్ష రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.

ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించిన వివరాలను బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ మీడియాకు వెల్లడించారు. కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు భారీ ప్లీనరీఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారులకు సమాచారం అందడంతో పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. సీపీఐ(మావోయిస్టు) బస్తర్‌ డివిజన్‌ నేతలు శంకర్‌, లలిత, రాజు ఈ మీటింగ్ కు హాజరవుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), జిల్లా రిజర్వు గార్డు(డీఆర్‌జీ), రాష్ట్ర పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా చోటేబేథియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఈ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో బీనగుండా-కొరగుట్ట అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో సాయుధ మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగారు, మావోయిస్టులను చంపారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటుగా భారీయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: పశ్చిమబెంగాల్ ఓటింగ్ లో రాళ్లదాడి..బీజేపీ నాయకుడికి గాయాలు..!

Latest News

More Articles