Sunday, April 28, 2024

కాంగ్రెస్ కు వరుసగా ఎదురుదెబ్బలు.. తాజాగా మరో షాక్..!

spot_img

లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇన్ కమ్ ట్యాక్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ కు ఐటీశాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా వెల్లడించారు. 2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి ఫెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ. 1700కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తమపై ఐటీశాఖ ప్రక్రియ నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు.

ఎలాంటి మదింపు ఉత్తర్వులు జారీ చేయకుండానే నోటీసులు ఇచ్చినట్లు వివేక్ ఆరోపించారు. ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య అంటూ ఫైర్ అయ్యారు. లోకసభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దీన్ని తాము చట్టపరంగా సవాల్ చేస్తామంటూ వెల్లడించారు.

కాగా అంతకుముందు ఐటీ శాఖ చేపట్టిన పునపరిశీలనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఇవే కారణాలతో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి రూ 135కోట్లను ఐటీ శాఖ రికవరీ చేసింది.

ఇది కూడా చదవండి: నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారు చేస్తాం..కేటీఆర్ ట్వీట్ వైరల్..!

Latest News

More Articles