Friday, May 3, 2024

బీఆర్‌ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వ‌ర్‌..ఈటలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

spot_img

హైద‌రాబాద్ : మాజీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ను సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించి, గులాబీ కండువా క‌ప్పారు. కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు అవ‌కాశాలు ఉంటాయ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన బండా ప్ర‌కాశ్‌ను ఎంపీ చేసుకున్నామని, మండ‌లి వైస్ చైర్మ‌న్‌గా చేసుకున్నట్లు గుర్తుచేశారు.

Also Read.. అభివృద్ధికి మారు పేరైన బీఆర్‌ఎస్‌కే మరో అవకాశం ఇవ్వాలి

ముదిరాజ్ సామాజిక వ‌ర్గం నుంచి ఈట‌ల రాజేంద‌ర్ ఎవ్వ‌రిని ఎద‌గ‌నివ్వ‌లేదని విమర్శించారు. మ‌న‌కున్న‌వి మొత్తం 119 సీట్లు.. అందులో ఏడు మ‌న‌వి కావు. మ‌న‌కున్న‌ది కేవ‌లం 112 సీట్లు. ఆ సీట్ల‌లో పెట్టిన వ్య‌క్తి ప‌క్కా గెల‌వాలి. ఏదో త‌మాషాకు అభ్య‌ర్థిని బ‌రిలో దింపి, ఆ సీటును కోల్పోయి, పార్టీకి న‌ష్టం చేకూర్చోవ‌డం రాజ‌కీయం కాదన్నారు.

Also Read.. తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టకండి

రాజ‌కీయంగా రాబోయే రోజుల్లో చాలా ప‌ద‌వులు ఉంటాయన్నారు. ముదిరాజ్ సామాజిక వ‌ర్గం పెద్ద‌దని, జిల్లాకు ఒక‌రిద్ద‌రిని త‌యారు చేసుకుంటే పార్ల‌మెంట్‌కు పెట్టుకోవ‌చ్చన్నారు. రాజేంద‌ర్ అటు పోయినా.. పెద్ద మ‌నిషి కాసాని జ్ఞానేశ్వ‌ర్ పార్టీలో చేర‌డం మంచి ప‌రిణామం అని సీఎం కేసీఆర్ అన్నారు.

Latest News

More Articles