Thursday, May 2, 2024

మెట్రో గుడ్ న్యూస్.. నేడు, రేపు అన్ లిమిటెడ్ రైడ్స్

spot_img

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఈ సందర్భంగా చాలా మంది నగరాల నుంచి గ్రామాలకు వెళుతున్నారు. ఈ సమయంలో గ్రామాల నుంచి పట్టణానికి కూడా వస్తుంటారు. సంక్రాంతి సెలవులను నగరంలో గడిపేందుకు చాలా మంది నగరాలకు వస్తుంటారు. పండుగను దృష్టిలో ఉంచుకొని వివిధ సంస్థలు, కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటిస్తాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ కూడా నగర వాసులకు శుభవార్త అందించింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో నగరవాసుల సమయం వృథా అవుతుంది. అలాగే, కిక్కిరిసిన జనాలు మరియు విపరీతమైన ట్రాఫిక్‌తో చాలా మంది చికాకు మరియు అసహనం వ్యక్తం చేస్తారు. అలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని మెట్రో ప్రయాణికులకు అధికారులు రాయితీలను అందిస్తున్నారు. తాజాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా మెట్రో రైల్ అధికారులు మరో శుభవార్త అందించారు. హైదరాబాద్ మెట్రోలో 3 రోజుల పాటు 13, 14, 15 తేదీలలో అపరిమిత రైడ్స్ ఆఫర్ అందుబాటులో తీసుకొచ్చారు. మెట్రో కార్డ్ హోల్డర్లు రూ.59 రీఛార్జ్ చేయడం ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి రూ. 59తో రీఛార్జ్ చేసుకొని, రోజంతా రైలులో ప్రయాణించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలా కాలంగా ఈ ఆఫర్ నడుస్తున్న సంగతి తెలిసిందే అయితే ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అధికారులు ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుండటం గమనార్హం.

Read Also: అత్తింటి వేధింపులు భరించలేక ఒకేసారి తోటికోడ‌ళ్ల ఆత్మ‌హ‌త్య

Latest News

More Articles