Thursday, May 2, 2024

జర్నలిస్టుపై ఫిర్యాదు చేసిన స్మృతి ఇరానీ.. విధుల నుంచి తొలగించిన యాజమాన్యం

spot_img

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు పాతరేసింది. కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు జర్నలిస్టులను బెదిరిస్తున్న ఘటనలు పదేపదే జరుగుతున్నాయి. గోద్రా అల్లర్లపై డాక్యుమెంటరీ విడుదల చేసిన బీబీసీపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పిన విషయం విదితమే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జర్నలిస్టులను బెదిరించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జూన్‌ 9న అమేథీలో పర్యటించారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో.. దైనిక్‌ భాస్కర్‌కు చెందిన జర్నలిస్టు విపిన్‌ యాదవ్‌ ఏదైనా మాట్లాడాలని మంత్రిని కోరారు. దాంతో విచక్షణ కోల్పోయిన మంత్రి.. అతని వైపు వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. ‘సేలన్‌లో మాట్లాడాను. ఇక్కడా మాట్లాడాలని అంటున్నారు. మీరు అమేథీ ప్రజలను అవమానిస్తున్నారు. మీ యాజమాన్యానికి నీ గురించి చెబుతాను’ అంటూ బెదిరించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే దైనిక్‌ భాస్కర్‌ యాజమాన్యం జర్నలిస్టు విపిన్‌ యాదవ్‌, వీడియో జర్నలిస్టు హుస్సేన్‌ను విధుల నుంచి తొలగించింది. కాగా.. జర్నలిస్టుపై విరుచుకుపడ్డ స్మృతి ఇరానీ వెంటనే క్షమాపణ చెప్పాలని ముంబాయి జర్నలిస్టుల సంఘం డిమాండ్ చేస్తోంది.

Latest News

More Articles