Thursday, May 2, 2024

జీవితంలో పెద్ద తప్పు చేశాను.. సమంత మళ్ళీ ఎమోషనల్

spot_img

సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతోను సమంత ట్రెండింగ్ లో ఉంటుంది. క్రేజీ సినిమాలు చేస్తూనే అంతకంటే హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది సామ్. విడాకులు అయ్యాకా కూడా తన వైవాహిక జీవితం, నాగ చైతన్యలను ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ పంచులు ఇస్తుంటుంది. అయితే సమంత తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. నేను జీవితంలో అది చేయటంలో ఫెయిల్ అయ్యానని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సమంత. ఇటీవల బ్రాడ్ కాస్ట్ ఛానల్‏లో అభిమానులతో ముచ్చటించిన సామ్.. తన జీవితంలో చేసిన పొరపాటు గురించి చెప్పుకొచ్చింది.

మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటీ ? అని అడగ్గా.. ‘ బహుశా తన లైఫ్ లో చేసిన మిస్టేక్ ఏంటంటే.. నా సొంత అభిప్రాయాలను, ఇష్టాలని, అయిష్టాలను అర్ధం చేసుకోవటంలో నేను పూర్తిగా ఫెయిల్ అయ్యాను. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఆ సమయంలో నేను భాగస్వామికి పూర్తిగా ప్రభావితం అయిపోయాను. టైం బాలేనప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం ఉందని గ్రహించాను. ఇది నా వ్యక్తిగత జీవితానికి చాల ఇంపార్టెంట్ అని కూడా అనుకున్నా’ అని కామెంట్స్ చేసింది సామ్. అయితే ఈ వ్యాఖ్యలని అభిమానులు స్క్రీన్ షాట్స్ తీసి మరి వైరల్ చేస్తున్నారు. నాగచైతన్యని ఉద్దేశించే సామ్ ఈ కామెంట్స్ చేసిందని అంటున్నారు.’

Latest News

More Articles