Friday, May 3, 2024

నేను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పను.. సహనం కోల్పోయిన రోహిత్ శర్మ..!!

spot_img

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో పాల్గొనే భారత జట్టు ప్రకటన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నాడు. ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నపై మిస్టర్ కూల్ రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

మెగా టోర్నీల్లో భారత్ ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయని, ఇలాంటి వాటిపై మీ స్పందనేంటని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దానికి రోహిత్ కాస్త ఘాటుగా స్పందించాడు. ఇలాంటి ప్రశ్నలను తానెప్పుడూ ప్రోత్సహించనని, ఇప్పటికే చాలాసార్లు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఆసియా కప్‌ కోసం బయల్దేరకముందు కూడా ఇలాంటి ప్రశ్నకే సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

Technology వాట్సాప్‌లో మ‌రో కొత్త‌ ఫీచర్: ఒకే ఫోన్‌ లో మ‌ల్టిపుల్ ఎకౌంట్స్

“నేను చాలా సార్లు చెప్పాను. బయట ఏమి జరుగుతుందో మేము పట్టించుకోము. మా జట్టులోని ఆటగాళ్లందరూ ప్రొఫెషనల్‌గా ఉన్నారు. నన్ను అలాంటి ప్రశ్నలు అడగవద్దు. నేను అలాంటి ప్రశ్నలను ప్రొత్సహించను. అలాంటి వాటి గురించి మాట్లాడటం భావ్యం కాదు. మా దృష్టి అంతా ఆటమీదే ఉంది. మేము బయటి విషయాలను పట్టించుకోము,” అని రోహిత్ అన్నారు.

వరల్డ్ కప్ స్క్వాడ్ ఆశించిన స్థాయిలో ఉందని శర్మ చెప్పారు. “ఆశ్చర్యకరమైన మార్పులు ఏమీ లేవు. ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నా అంతిమంగా 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేయగలరు. పరిస్థులకు అనుగుణంగా తుది జట్టును ఎంపిక చేస్తాం. ఆలౌరౌండర్లు మాకు అదనపు బలం. 8, 9 స్థానాల్లో బ్యాటింగ్ చేసేవాళ్లు ఆటలో కీలకం కానున్నారు.’’ అని రోహిత్ తెలిపారు.

 ODI ప్రపంచ కప్ 2023 జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వీసీ), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Latest News

More Articles