Friday, May 3, 2024

ఫ్రీ విత్ కండిషన్స్.. ఉచిత కరెంట్ పథకంలో కొత్త ట్విస్ట్..!

spot_img

తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న పథకం ఉచిత కరెంట్ పథకం. అధికారంలోకి రాగానే ఈ పథకం ప్రారంబిస్తామని ప్రజలకు చెప్పి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచింది. డిసెంబర్ నెల నుండే ఉచిత కరెంట్ పథకం షురూ అవుతుందని హామీలు ఇచ్చింది. స్వయంగా రేవంత్ రెడ్డే డిసెంబర్ లో కరెంట్ బిల్లు కట్టొద్దని చెప్పారు. అది నమ్మిన ప్రజలు డిసెంబర్ లో కరెంట్ బిల్లులు కట్టలేదు. అయితే ఇప్పుడు వీరికి షాక్ ఇచ్చింది కాంగ్రెస్. మాట మారుస్తూ ఉచిత కరెంట్ కావాలంటే బిల్లులు కట్టాల్సిందే అని ఫిట్టింగ్ పెట్టింది ప్రభుత్వం. తాజాగా ఉచిత కరెంట్ పథకానికి సంబంధించి కీలక వివరాలు బయటకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పథకం అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఐతే ఉచిత కరెంట్ పథకం వర్తించాలంటే.. బకాయిలు ఉండకూడదని అధికారులు చెప్తున్నారు. వెంటనే ప్రజలు పెండింగ్ బిల్లులు కట్టాలని ఆదేశిస్తున్నారు. బిల్లులు కట్టకుంటే ఉచిత కరెంట్ ఇవ్వమని దమ్కీలు ఇస్తున్నారు. అయితే పెండింగ్ బిల్లులు వసూళ్లు చేయడానికే ఈ డ్రామా అంటున్నారు. ఒకసారి బిల్లులు కట్టగానే.. ఎలక్షన్ కోడ్ చెప్పి ఉచిత కరెంట్ పథకాన్ని ఆపేస్తారని అంటున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల తరువాత కూడా.. రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ, ఉచిత కరెంట్ పథకం ఆపేస్తే ఏంటీ పరిస్థితి అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడంతో.. చాలా మంది డిసెంబరు, జనవరి బిల్లులు కట్టలేదు. వారంతా పెండింగ్ బిల్లులను కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం డిసెంబరు, జనవరి బిల్లులను మాఫీ చేసి వెంటనే ఉచిత కరెంట్ పథకం అమలు చేయాలని కోరుతున్నారు.

Latest News

More Articles