Thursday, May 2, 2024

ఆసియా-పసిఫిక్ దేశాల్లో టెన్షన్..టెన్షన్..!

spot_img

పసిఫిక్‌ మహా సముద్రంలో టెన్షన్ పరిస్థితి నెలకొన్నది. 2011 సునామీలో దెబ్బతిన్న ఫుకుషిమా అణు రియాక్టర్‌లో పేరుకుపోయిన వ్యర్థ జలాలను మరో 48 గంటల్లో జపాన్‌ సముద్రంలోకి విడుదల చేయనుంది. ఈ విషయాన్ని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా మంగళవారం వెల్లడించారు.

జపాన్‌ నిర్ణయాన్ని చుట్టుపక్కల దేశాలైన చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు యూఎన్ఓ పర్యవేక్షక సంస్థ ఐఏఈఏ మాత్రం ఇప్పటికే అణు వ్యర్థ జలాలను విడుదల చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

జపాన్‌ వద్ద శుద్ధి చేసినట్లుగా చెబుతున్న 1.34 మిలియన్‌ టన్నుల అణు జలాలు ఉన్నాయి.  2011 నుంచి జపాన్‌ ఈ అణుజలాలను నిల్వచేసింది. ఈ భార జలాలను రానున్న 30 ఏళ్లపాటు సముద్రంలోకి దశలవారీగా విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉండగా.. టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టెప్కో) ఈ నీటిని వడగట్టి 60 రకాల రేడియో యాక్టివ్‌ పదార్థాలను తొలిగిస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. అయితే, ఇంకా ఆ జలాల్లో ట్రీటియం, కార్బన్‌-14 మూలకాలు ఉంటాయని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నీటి కారణంగా ఇక్కడి మత్స్య సంపదకు డిమాండ్‌ పడిపోతుందని చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఫుకుషిమా అణుకేంద్రం సమీపంలోని జలాల నుంచి పట్టిన చేపల దిగుమతిపై చాలా దేశాలు నిషేధం విధించాయి.

Latest News

More Articles