Saturday, May 11, 2024

భార్యతో హనీమూన్‌కు.. అశ్లీల వీడియోలు తీసి డబ్బు కోసం బెదిరింపులు..!

spot_img

ఉత్తర్‌ప్రదేశ్‌ బదాయూకు చెందిన ఓ ప్రబుద్ధుడు.. తన భార్యను హనీమూన్‌కు తీసుకెళ్లడానికి అత్తింటివారిని రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ఆపై హనీమూన్‌కు తీసుకెళ్లి.. భార్య అశ్లీల వీడియోలు డబ్బు కోసం బెదిరింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలీభీత్‌లో ఉంటున్న యువతిని ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత భార్యను దూరం పెట్టాడు.

విషయం తెలిసి అత్తింటివారు ప్రశ్నించగా.. రూ.10 లక్షలు ఇస్తేనే తన భార్యను హానీమూన్‌కు పోతానని బెట్టు పట్టాడు. రూ.5 లక్షలు ఇవ్వడంతో ఈ నెల 7న హానీమూన్‌ కోసం నైనితాల్‌ వెళ్లారు. అక్కడ భార్య అశ్లీల వీడియోలు తీసి.. మిగతా రూ.5 లక్షలు తీసుకురావాలని లేదంటే వైరల్‌ చేస్తానని బెదిరించాడు. భర్త తీరుతో విసిగిపోయిన బాధితురాలు.. 13న తన పుట్టింటికి చేరుకొని అత్త, భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Latest News

More Articles