Thursday, May 2, 2024

9/11 Attacks: 22 ఏళ్ల తర్వాత ఇద్దరు మృతుల గుర్తింపు

spot_img

వాషింగ్టన్‌: 2021 సెప్టెంబర్ 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడితో సృష్టించిన మారణహోమంతో అగ్రదేశం అమెరికా వణికిపోయింది. ఆ దాడిలో ట్విన్ టవర్స్ నెలకూలాయి. ఆ విషాదంలో దాదాపు 3వేల మంది చనిపోయారు. అప్పటినుంచి మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Also Read.. జీ20 వేదికపై కరీంనగర్‌కు అరుదైన గౌరవం

ఈ క్రమంలోనే ఇద్దరు మృతుల గుర్తింపును తాజాగా నిర్ధారించినట్టు న్యూయార్క్‌ చీఫ్ మెడికల్‌ ఎగ్జామినర్ వెల్లడించారు. కాగా మృతుల కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆ ఇద్దరి మృతుల వివరాలు బయటకు వెల్లడించలేదని అధికారులు తెలిపారు. ఆ ఘటనలో సేకరించిన అవశేషాల డీఎన్ఏ నిర్ధారించేందుకు ఆధునాతన సాంకేతికతను ఉపయోగించామని చెప్పారు.

Also Read.. అది సిగ్గుమాలిన, నీతిమాలిన నిర్ణయం.. భారత మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్..!!

ఆ ఘటనలో చనిపోయిన వారిలో దాదాపు 40 శాతం అంటే 1,104 మంది అవశేషాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఈ దాడికి ప్రతీకారంగా ఈ దాడులకు సూత్రధారి, అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ను ఉత్తర పాకిస్థాన్‌లో గుర్తించిన అమెరికా.. 2011లో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి అంతం చేసింది.

Latest News

More Articles