Thursday, May 2, 2024

పోలీసులను గుడ్డలూడదీసి కొడతానన్న రేవంత్ రెడ్డి మీద కేసు నమోదు

spot_img

మహబూబ్ నగర్ పోలీసులపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జిల్లా పోలీస్ అధికారుల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆగష్టు 14న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది గాంధీభవన్ వేదికగా పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ మీటింగ్‎లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పోలీసులను ఒక్కొక్కడిని గుడ్డలూడదీసి కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

కాగా.. పోలీసులు ప్రజారక్షణకై అహర్నిశలు పగలనక రేయనక కష్టపడుతుంటే ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జిల్లా పోలీస్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఇట్టి వ్యాఖ్యలు రాష్ట్రంలోని మరియు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షలాది పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. పొలీసు కుటుంబాల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. మేం చట్టానికి, న్యాయ స్థానాలకు లోబడి పనిచేస్తాం తప్ప.. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, భవిష్యత్‎లోనైన పోలీస్ వ్యవస్థను విమర్శించే ప్రక్రియను మానుకోవాలని సూచించారు. రేవంత్ మీద బూత్పుర్ పోలీస్ స్టేషన్‎లో Cr.No 184/2023, u/s 153, 504, 505 (2), 506 IPC సెక్షన్లు, జడ్చర్ల పోలీస్ స్టేషన్‎లో Cr.No 499/2023, u/s 153, 504, 505 (2), 506 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Latest News

More Articles