Friday, May 10, 2024

రాత్రి స్టూడియోకి రమ్మని.. పవన్ వేధించాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

spot_img

బాలీవుడ్ టు టాలీవుడ్.. వెండితెర, బుల్లితెర అని తేడాలేకుండా నటీమణులంతా వేధింపులకు పాల్పడ్డ దర్శకులు, నిర్మాతలు, హీరోల పేర్లు బహిరంగంగా చెప్తున్నారు. తాజాగా భోజ్‌పురిలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న హీరోయిన్.. ఒక హీరోహీరోపై సంచలన ఆరోపణలు చేసింది. గాయకుడు పేరు తెచ్చుకుని స్టార్ హీరోగా ఎదిగిన పవన్ సింగ్ పై హీరోయిన్ యామినీ సింగ్ తీవ్ర ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. పవన్ తనను రాత్రికి రమ్మని అడిగాడని నటి వెల్లడించింది.ఒక ప్రముఖ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘హీరో పవన్ సింగ్ నాకు మూవీ ఛాన్స్ ఇచ్చాడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అది చాలా రాంగ్. నా మొదటి సినిమా ‘బాస్’ అవకాశమిచ్చింది దర్శకుడు అరవింద్ చౌబే.

ఈ చిత్రం నుంచి నన్ను ఎవరూ తీసేయలేదు. నేను తప్పుకొన్నాను. పవన్ చాలా మంచి యాక్టర్ అని నాకు అప్పటికి తెలుసు. సెట్స్ లో ఫస్ట్ టైం కలిసినప్పుడు అతడితో అదే చెప్పాను. అప్పటివరకు అతడి గురించి నిజం నాకు తెలియదు. ఎందుకంటే ఓరోజు రాత్రి 9 గంటలకు అనుకుంటా కాల్ చేశాడు. ఆటోలో స్టూడియోకు రమ్మని అడిగాడు. లేదంటే నేనే వచ్చి నా కారులో పికప్ చేసుకుంటానని చెప్పాడు. ఈ టైంలో రాలేనని చెబితే.. సినిమా చేయాలని ఉందా లేదా? అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు కాల్ కట్ చేసి, సినిమా నుంచి సైడ్ అయిపోయాను’ అని యామినీ చెప్పుకొచ్చింది.

Latest News

More Articles