Sunday, April 28, 2024

సీఎం కేసీఆర్ కు ఢిల్లీ ప్ర‌జ‌ల త‌ర‌పున ధ‌న్య‌వాదాలు.. మోదీ పతనం మొదలైంది

spot_img

హైద‌రాబాద్ : నాన్ బీజేపీ స‌ర్కార్ల‌ను కూల్చివేయ‌డం బీజేపీకి అల‌వాటు అయ్యింద‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన త‌ర్వాత నిర్వ‌హించిన ప్రెన్‌కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న మాట్లాడారు. ఢిల్లీ ప‌రిపాల‌న‌ను అడ్డుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ పై.. నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఏకం కావాలని కోరారు.

ఆర్డినెన్స్ విషయంలో ఢిల్లీకి స‌హ‌కారం అందించిన తెలంగాణ సీఎంకు.. ఢిల్లీ ప్ర‌జ‌ల త‌ర‌పున ధ‌న్యవాద‌లు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఒక‌వేళ గ‌వ‌ర్న‌రే పాల‌న చేయాల‌నుకుంటే.. అప్పుడు ముఖ్య‌మంత్రిని ఎన్నుకోవాల్సి అవ‌స‌రం ఏముంద‌ని కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు.

స‌ర్వీస్ సంబంధిత విష‌యాల్లో తాము 8 ఏళ్లు పోరాటం చేశామ‌ని, మే 11వ తేదీన ఢిల్లీ ప్ర‌జ‌ల త‌ర‌పున సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చింద‌ని, కానీ 8 రోజుల్లో వ్య‌తిరేక ఆర్డినెన్స్ తీసుకువ‌చ్చిన ఢిల్లీ అధికారాల్ని మోదీ స‌ర్కార్ లాగేసుకుందని కేజ్రీవాల్ తెలిపారు. ఇది ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను ఇది అవ‌మానించ‌డ‌మే అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తమ పోరాటం

పంజాబ్ సీఎం భ‌గ‌వంత్‌మాన్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము పోరాటం చేస్తున్న‌ట్లు తెలిపారు. విపక్షాల ఐక్యత మోదీ ప్రభుత్వ పతనానికి నాంది అన్నారు. నాన్ బీజేపీ రాష్ట్రాలపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తూ.. వేధింపులకు పాల్పడుతుందని పేర్కొన్నారు.

Latest News

More Articles