Sunday, April 28, 2024

ఢిల్లీలో గులాబీ జెండా.. తెలంగాణకి శ్రీరామరక్ష..!

spot_img

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గౌతమ్ నగర్ డివిజన్ లక్ష్మీ గార్డెన్స్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,కార్పొరేటర్లు పాల్గొన్న ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ లో ప్రజలు అందరు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి పట్టం కట్టారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి జిల్లాలో ఉండే ప్రజలను అమాయకులను మోసం చేసి గద్దెనెక్కారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులయ్యింది కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయి. రైతులకు రైతు బంధు పడలేదు. ఫ్రీ బస్ వల్ల అడబిడ్డలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లు ఆగమైనరు. నోటికొచ్చిన మాటలు అమలుకాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు.

రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇంకా చేయలేదు. కోటి 57 లక్షల మహిళలు మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. మేం కూడా 100 రోజులు ఓపిక పడతాం. మార్చి 17 వరకు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని బొందపేస్తాం. తిట్ల పురాణం బంద్ చేయాలి రేవంత్ రెడ్డి. కార్యకర్తలను కాపాడుకుంటాం పార్టీ అండగా నిలుస్తుంది. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లలేరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడుతారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మేం నెరవేర్చుతాం అంటున్నారు ఆ మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు. రాబోయే ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ సిటు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఢిల్లీలో గులాబీ జెండా ఉంటేనే మన ఎంపీలు గెలిస్తేనే మన రాష్ట్ర సమస్యలు మాట్లాడుతారు. మన అధినేత కేసీఆర్ ఎంపిగా ఎవరికి అవకాశం ఇచ్చిన భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని అన్నారు కేటీఆర్.

Latest News

More Articles