Monday, May 6, 2024

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజలు పశ్చాతాప పడుతున్నారు

spot_img

మంచిర్యాల జిల్లా : గెలుపు ఓటములు రాజకీయంలో సహజం.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజలు పశ్చాతాప పడుతున్నారని, అధికారంలోకి రాగానే రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఎందుకు చేయటంలేదని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే రూ.4000పెన్షన్ ఇస్తామన్నారు.. ఇప్పటికీ పథకాన్ని అమలు చేయలేదని అన్నారు.

చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు 45000ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామిని నిలబెట్టుకోవాలి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి. చేసేదాకా ప్రజల పక్షాన బీఅర్ ఎస్ పార్టీ పోరాడుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ తో కలిసి బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారు. దళిత బంధు మీద కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు.

చెన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ దండ విఠల్, మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, మాజీ మంత్రి బోడ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read.. భారత రాయబార కార్యాలయంలో ఐఎస్‌ఐ గూఢచారి

Latest News

More Articles