Friday, May 3, 2024

సీబీఐకి చిక్కిన అవినీతి తిమింగలం.. కళ్లు చెదిరే సంపద..!!

spot_img

CBI Arrests Railway Official: ఒక లంచం కేసులో రైల్వే అధికారిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆయన నివాసాల్లో జరిపిన సోదాలలో రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది.

ఇది కూడా చదవండి.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన భారత క్రికెటర్లు

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్‌ నార్త్ ఈస్టర్న్ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ మెటీరియల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న కేసీ జోషి ఒక కాంట్రాక్ట్‌ సంస్థ నుంచి ఏడు లక్షలు లంచం డిమాండ్‌ చేశాడు. చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

బాధితుడి ఫిర్యాదుతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. రైల్వే అధికారి కేసీ జోషి రూ.3 లక్షలు లంచంగా తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయనకు చెందిన గోరఖ్‌పూర్‌, నోయిడాలోని కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు.

Latest News

More Articles