Monday, May 6, 2024

మీరు నాకే అడ్డొస్తారా.. ఊదేస్తే నశం లెక్కపోతరు

spot_img

ఎవరి కోసం పాలమూరు బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారో నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సింగోటం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీళ్లు వచ్చేది పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు. ఒక పక్కన బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ పోరాటం చేస్తే.. మీరు ఎవరి కోసం మౌనం పాటిస్తున్నారని బీజేపీ నేతలను నిలదీయాలి. పాలమూరు రంగారెడ్డి ఎట్టకేలకు పూర్తి చేసుకున్నాం. భగవంతుడి దయతో విజయం సాధించాం. ఆంధ్రా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

మీ నీళ్లు మాకు అవసరం లేదు. మా వాటా మాకు చెబితే.. దాని ప్రకారం తీసుకొని బతుకుతం తప్పా.. మరొకటి లేదు. బీజేపీ నాయకులు సిగ్గుంటే.. ప్రధానమంత్రి వద్దకు పోయి కృష్ణా వాటా తేల్చాలని పోరాటం చేయాల్సింది పోయి.. కేసీఆర్‌కు అడ్డం వచ్చి జెండాలు పట్టుకొని వస్తారా? నా వెంట లక్షల మంది ఉన్నరు. మీరు ఊదేస్తే నశం లెక్కపోతరు. మనకు సంస్కరం, పద్ధతి, ఓపిక ఉంది. పనులు చేసుకుంటున్నాం. ఆకలితో ఉన్నం. వలసలు పోయినోళ్లం. ఆగమైనోళ్లం కాబట్టి.. ఇప్పుడిప్పుడే మొఖాలు తెల్లబడుతున్నయ్‌. రైతుబంధు, బీమా పెట్టుకున్నాం. 24 గంటల ఉచిత కరెంటు పెట్టుకున్నాం అని అన్నారు కేసీఆర్.

Latest News

More Articles