Thursday, May 9, 2024

గంగమ్మ ఒడికి బాలాపూర్ గణేష్

spot_img

బాలాపూర్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరాడు. హుస్సేన్ సాగర్‌లో బాలాపూర్ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యింది. అంతకుముందు క్రేన్ నెంబర్ 13 దగ్గర బాలాపూర్ గణపతికి ప్రత్యేక పూజలు చేశారు బాలాపూర్ ఆలయ కమిటీ ఛైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డి. అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేశారు. బాలాపూర్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల పూటా గణేశ్ శోభాయాత్ర కొనసాగింది.

అంతకుముందు గురువారం ఉదయం బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈసారి లడ్డూ భారీ ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది కంటే రూ.2.40 లక్షలు అదనంగా ధర పలికింది. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాట జరుగుతోంది. ఈ ఏడాది మొత్తం 36 మంది వేలం పాటలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24.60 లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూ వేలానికి ఇవాళ్టితో 30 ఏళ్లు పూర్తైంది.

Latest News

More Articles