Friday, May 3, 2024

తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఐటీ రిఫండ్ స్కీమ్

spot_img

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రీఫండ్ స్కీమ్ వెలుగు చూసింది.  రెండు రాష్ట్రాల్లో 16 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి రీఫండ్ పేరుతో 500 కోట్ల రూపాయల పైచిలుకు స్కాం జరిగినట్టు గుర్తించారు.  టాక్స్ కన్సల్టెంట్ తో పాటు చార్టెడ్ అకౌంట్ లు కలిసి స్కాంకు పాల్పడ్డట్టుగా ఐటీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఎంప్లాయిస్ లే భారీగా లబ్ధి పొందినట్లు అనుమానిస్తున్నారు. వందల మందిని ఐటి ఆఫీస్ కి పిలిచి అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాదులో మరో 8 చోట్ల ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఏకకాలంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ,గుంటూరు, తిరుపతి అనంతపూర్ లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Latest News

More Articles