Friday, May 10, 2024

తన మేధో సంపత్తితో.. పీవీ నరసింహారావు దేశాన్ని గాడిన పెట్టారు

spot_img

నిజామాబాద్ నగరంలోని బోర్గాం కమాన్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీలు కవిత, వాణి దేవిలు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే లు బాజీ రెడ్డి గోవర్ధన్,గణేష్ గుప్తాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ చేసిన గణ కార్యాల వల్ల దేశం కుదేలైన పరిస్థితుల్లో పదవిలోకి వచ్చిన పీవీ ,కేవలం తన మేధో సంపత్తితో దేశంను గడ్డు పరిస్థితి నుండి కాపాడారు. మల్టీ నేషల్ కంపెనీలను ఆహ్వానించి దేశ ఆర్థిక పురపుష్టి సాధించారు. పీవీ విగ్రహ ఏర్పాటుతో ఇందురుకు కొత్త శోభ వచ్చింది. ఇండురు బ్రణ్మన సంఘానికి ధన్యవాదాలు. మహాత్ముల స్ఫూర్తి తో కొత్త ఉత్సాహం వస్తది.

ఎంతో మేదో సంపత్తి ఉన్న పీవీ ప్రధాని గా ఉన్నప్పుడు పట్వారిగా ఉన్నపుడు ఒకేరకంగా ఉండేవారు. ఎంత ఎదిగినా వొడిగే గుణం తెలంగాణ గడ్డకు మాత్రమే ఉంది. విద్య శాఖ ను మానవ వనరులను పెంపొందించే శాఖ గా పేరు మార్చి మానవ వనరుల అభివృద్ధి సాధించారు. నవోదయ పేరుతో లక్షలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చి దిద్దిన గొప్ప వ్యక్తి పీవీ. టెక్నాలజీ లో యువత కు ఆదర్శం గా నిలిచేందుకు ఆనాడే కంప్యూటర్ నేర్చుకొని ఆదర్శం గా నిలబడ్డారు. కష్టపడి పనిచేస్తే పీవీ నరసింహా రావు అంతటి వారు ఎవరైనా కావొచ్చు. ఇందుకు పీవీ నే ఉదాహరణ. ప్రపంచం అంతా పీవీ శత జయంతి ఉత్సవాలను జరిపిస్తున్నా సీఎం కేసీఆర్ గారికి కృత్ఞతలు. పీవీ స్ఫూర్తి ప్రతి తెలంగాణ గుండెకు తట్టేటు శత జయంతి ఉత్సవాలు జరుగు తున్నాయి’ అని అన్నారు కవిత.

Latest News

More Articles