Thursday, May 2, 2024

మ‌ల్కాజ్‌గిరిలో మ‌న‌కు పోటీ కాంగ్రెస్‌తో కాదు.. బీజేపీతోనే

spot_img

మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌లో మ‌న‌కు పోటీ కాంగ్రెస్‌తో కాదు.. బీజేపీతోనే అని అన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను మ‌ళ్లీ జ‌ర‌గ‌నివ్వొద్ద‌ని ర్ సూచించారు. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన మ‌ల్కాజ్‌రి పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

మేడ్చ‌ల్ అంట‌నే మాస్.. మ‌ల్ల‌న్న మారి మాస్.. కేత‌క్క కూడా సూప‌ర్. ఆమె మాట్లాడుతుంటే మ‌రింత విన‌బుద్ది అవుతుంది. ఆమె మాట్లాడిన త‌ర్వాత మాట్లాడాలంటే యాట‌కూర తిన్నాక తోట‌కూర తిన్న‌ట్టు ఉంటుంది. మ‌ల్లా రెడ్డి మేడ్చ‌ల్‌కే ప‌రిమితం కాకుండా.. రాష్ట్ర‌మంతా తిరగాలి. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఆయ‌న గొంతు అవ‌స‌రం అని కేటీఆర్ తెలిపారు.

మ‌ల్లారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందించి ఎన్నో ర‌కాల సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేశారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో 10 మున్సిపాలిటీలు ఉంటే అన్నింటికి అన్ని గెలిచారు. అయితే గెలిచింది మ‌ల్లారెడ్డి అంటున్నారు కానీ గెలిపించింది మీరు. మీరు క‌ష్ట‌ప‌డితేనే 10కి 10 గెలిచాం. ఎంతో క‌మిట్ మెంట్ ఉంటేనే ఇది సాధ్య‌మైంది. మేడ్చ‌ల్‌లో బీఆర్ఎస్ బ‌ల‌మేందో తెలిసిపోయింద‌న్నారు కేటీఆర్.

బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి సామాజిక సేవ‌లు చేస్తూ మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌లోని ప్ర‌జ‌ల‌తో క‌లిసి మెలిసి ఉన్నారు. బ్ర‌హ్మాండంగా ఆయ‌నకు సేవాగుణం ఉంది. వారిని కేసీఆర్ పిలిచి ఆశీర్వ‌దించి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. మ‌న‌కు కాంగ్రెస్‌తో పోటీ లేదు. కేవ‌లం డ‌మ్మీ అభ్య‌ర్థిని మ‌న ప్రాంతంతో సంబంధం లేని వ్య‌క్తిని నిల‌బెట్టారు. చేవెళ్ల‌లో రిజెక్ట్ చేస్తే ఇక్క‌డ బ‌ల‌వంతంగా నిల‌బెట్టారు. ఇక్క‌డ మ‌న‌కు పోటీ బీజేపీతోనే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఫోన్​ ట్యాపింగ్ కేసు​లో నాపై ఆరోపణలు చేసిన వారంతా క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

Latest News

More Articles