Sunday, May 5, 2024

కేసీఆర్‌ పొలంబాట పట్టిన తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు

spot_img

కేసీఆర్‌ పొలంబాట పట్టిన తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. నిన్న గాయత్రి పంప్‌ హౌస్‌ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేశారని, కేసీఆర్‌ వెళ్లడంతో సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు వదిలారని చెప్పారు. ఇప్పుడు కరీంనగర్‌ వస్తున్నారని ఎస్సారెస్పీ కాలువకు నీళ్లిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఎండిన పంటలకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు

ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్  వైఫల్యమే పంట నష్టం. కరువును నివారించే ప్రయత్నలు ప్రభుత్వం చేయడం లేదు.దొంగలు పడ్డాక అరు నెలలకు కుక్కులు మోరిగినట్లుగా ఉంది సర్కారు తీరు. కేసీఆర్ పొలం బాట పట్టకే ప్రభుత్వం పంటల విషయంలో కళ్ళు తెరిచింది. బీఆర్ఎస్ పోరాటాల వల్ల రైతులకు కొంత ఊరట. వడగళ్ళు, ఎండిన పంటలకు ఎకరాకు 25 వెల నష్ట పరిహారం ఇవ్వాలి. వంద రోజుల్లో చేస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలి. ఎలక్షన్ కోడ్ ఉందని ఉత్తమ్ చావు కబురు చల్లగా చెప్పారు. రైతులను దగా చేసింది కాంగ్రెస్. వంద రోజుల తర్వాత నే కోడ్ వచ్చింది. పంటలకు ఇస్తామన్న  బోనస్ యసంగి పంటలకు ఇచ్చి కొనుగోలు చేయాలి. ఎకరాకు 15 వెలు రైతులకు, కౌలు రైతులకు వెంటనే ఇవ్వాలి. అడుగడుగునా రైతులకు కాంగ్రెస్ అన్యాయం. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలి. బీ అర్ఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా మదెప్పుడు రైతు పక్షమే. రైతుల పక్షాన కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన ముప్పు. కూడవెల్లి వాగులోకి తక్షణమే నీళ్ళు విడుదల చేయాలి. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరా ఎండలే.. కాంగ్రెస్ వచ్చాకే పంటలు ఎండుతున్నాయి. నీళ్ళు ఉన్నా ఇవ్వక పోవడంతో పంటలు ఎండగడుతున్నారు. 24 గంటల్లో కూడవెల్లికి నీళ్ళు ఇవ్వక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.. మల్లన్నసాగర్ ను ముట్టడిస్తామన్నారు.

రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్నారు హరీశ్ రావు. తక్షణమే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి బోగస్ మాటలు మాట్లాడుతున్నారు.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మమ్మల్ని విమర్శించే హక్కు లేదన్నారు. దొడ్డిదారిన అధికారంలో కు వచ్చిన కాంగ్రెస్ హామీల అమలును విస్మరించిందని తెలిపారు. కాంగ్రెస్ హమీల విషయంలో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం మన్నారు హరీశ్ రావు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓవరు వచ్చిన సరే. పంటలు ఎండుతుంటే వికృత అనందం పొందుతోంది కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు తగ్గి రైతుల కళ్లల్లో కన్నీళ్లు పెరిగాయన్నారు. దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలను కూడా జోకులు వేస్తున్నారు. విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకునే శ్రద్ద రైతులకు నీళ్ళు ఇవ్వడంలో లేదని విమర్శించారు. ఇప్పటికైన ప్రభుత్వం రాజకీయాలు మాని రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు మేలు చేస్తే మేము అడ్డుకొం.. మీలాగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోమని తెలిపారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: మ‌ల్కాజ్‌గిరిలో మ‌న‌కు పోటీ కాంగ్రెస్‌తో కాదు.. బీజేపీతోనే

Latest News

More Articles