Saturday, April 27, 2024

ఎన్నికలను నడిపించేది ఈసీ కాదు ఈడీ

spot_img

ఎన్నికల సమయంలో పోటీ ఉండాలి.. ప్రధాని మోడీ ఆడే ఆటలు ఈడీ,సీబీఐ ఆడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. అంతేకాదు..ఎన్నికల సమయంలో కావాలనే ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేశారని విమర్శించారు. తెలంగాణ కు చేసింది ఏమిలేకనే ఇక్కడ ఎన్నికలప్పుబు చెప్పుకోవడం కోసం ఈడీ అరెస్ట్ ని చెప్పుకుంటున్నారన్నారు. శివసేన అభ్యర్థి నామినేషన్ వేసి రాగానే ఈడీ దాడి. తమిళనాడు లు రాజాకు ఈడీ నోటీసులు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఈడీ నోటీసులు. సమాజవాది పార్టీ అభ్యర్థి పైన దాడి. కశ్మీర్ ఫారుక్ అబ్దుల్లా పైన కేసు. ఇలా అన్ని రాష్ట్రాల పైన మోడీ దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు క్రిశాంక్.

లోకసభ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయన్నారు మన్నె క్రిశాంక్. ఎన్నికలను నడిపించేది ఈసీ కాదు ఈడీ అని అన్నారు. బండి సంజయ్ 10వేల కోట్ల అవినీతి అంటాడు, ఈడీ నేమో 100 కోట్ల స్కాం అంటుంది. సుజనా చౌదరీ 6000 కోట్ల బ్యాంక్ స్కాం అని చెప్పిన ఈడీ.. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వారికీ లొంగితే అరెస్ట్ లు, ఈడీ దాడులుండవు. ఎవరు ప్రచారం చేయద్దు ఈడీ ఆఫీస్ ల చుట్టూ తిరగాలి. సమస్యల గురించి ఎన్నికల్లో చర్చకు రాకుండా ఉండాలని ఈడీ దాడులు చేస్తున్నారు అని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మా నాయకుడుని ప్రచారం చేయనీయకుండా చేయాలని చూస్తున్నారు. రానున్న లోక సభ ఎన్నికల్లో ప్రజలుకు అన్నీ వివరిస్తాం. బీజేపీ ఓడిపోనుంది అందుకే రాష్ట్రాలలో ఉన్న నాయుకులు పైన దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మన్నె క్రిశాంక్.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ నిర్లక్ష్య విధానాలతో రైతులు ఆగమైపోతున్నరు

Latest News

More Articles