Friday, May 10, 2024

అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ అయిన రామ్ చరణ్

spot_img

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తం అయింది. ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన నటన విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు అందరినీ ఆకట్టుకుంది. ఆర్‎ఆర్ఆర్ సినిమా రామ్ చరణ్ నటనను మరో స్థాయిలో నిలబెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాకు నామినేషన్లు సాధించి పెట్టింది. ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు ప్రతిష్టాత్మక అవార్డులు ఈ సినిమాకి దక్కాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ క్రేజ్‌తో గ్లోబల్ స్టార్స్‎గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా తాజాగా రామ్ చరణ్ పేరు సినీ వర్గాల్లో మరోసారి మార్మోగుతోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డు అయిన పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు ఇండియా నుంచి నటీనటుల ఆఖరి జాబితా వ‌చ్చింది. అందులో పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో సహా మన తెలుగు హీరో రామ్ చరణ్ పేరు కూడా ఉంది. ఆయన కూడా ఆ అవార్డులకు నామినేట్ అయ్యాడు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ అవార్డు ఈవెంట్ త్వరలోనే అమెరికాలో జరగనుంది. కాగా.. చెర్రీ ప్రస్తుతం టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు.

Latest News

More Articles