Friday, May 3, 2024

చంద్రబాబుకి చేతకానిది సీఎం కేసీఆర్ చేసి చూపెట్టాడు..!

spot_img

చంద్రబాబు వల్ల కానిది… సీఎం కేసీఆర్ చేసి చూపించారని మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సిద్దిపేటలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి హరీష్ రావుతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. ఐటీ టవర్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది.. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందన్నారు.. మరో సారి సీఎం కేసీఆర్ ని గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పేర్కొన్నారు మంత్రి హరీష్‌రావు. చంద్రబాబుపై మంత్రి హరీష్‌రావు పరోక్ష విమర్శలు చేస్తూ.. గతంలో ఎందరో పాలించారని వివరించారు. విజన్‌ 2020 అన్నారు.. హైటెక్‌ అన్నారు. కానీ వాళ్ళ వల్ల కానిది సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు హరీష్‌ రావు.

Latest News

More Articles