Thursday, May 2, 2024

దేశంలో తెలంగాణ నంబర్ వన్

spot_img

వనపర్తిలో మైనారిటీ ఆడబిడ్డలకు షాదీ ముబారక్ చెక్కులు అందజేసారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇక అర్హులయిన పేదలందరికీ ఆసరా పథకం కింద ఫించన్లు, పేద పిల్లల చదువుల కోసం సంక్షేమ గురుకుల పాఠశాలలతో విద్య పేదల వైద్యం కోసం ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఉచితంగా కాన్పులు, శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలు, డయాలసిస్ కేంద్రాలు, సాగునీటి రాకతో రైతులు, రైతు కూలీలకు చేతి నిండా పని దొరికిందిన్నారు. ఇక సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ వన్ అని.. ప్రజల అవసరాలు ప్రాతిపదికగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్టు ప్రకటించారు.

వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖిల్లాఘణపురం నుండి 100 మంది మైనారిటీలు, పెబ్బేరు మండలం గుమ్మడం నుండి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ పార్టీలకు చెందిన వెంకటస్వామి, యాపర్ల నర్సింహ, బాబు, వడ్ల నందు, ఈరపోగు మధు తదితరులు 100 మంది బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఖిల్లాఘణపురం సర్పంచ్ వెంకటరమణ, పెబ్బేరు పార్టీ మండల అధ్యక్షులు వనం రాములు తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles