Thursday, May 2, 2024

వలస వేళ్లినోళ్లు తిరిగి గ్రామాలకే వలస వస్తున్నారు.. తెలంగాణ అంటే అది

spot_img

హైదరాబాద్ లోని మాదాపూర్ ప్లాటినం హైట్స్ లో 2500 మందితో నిర్వహించిన వనపర్తి వాసుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ. ప్రణాళికాబద్దంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. పల్లెల నుండి పట్టణాలకు వలసలు ఆగి .. పట్టణాల నుండి పల్లెలకు వస్తున్నారు. హైదరాబాద్ లో స్థిరపడ్డ వారంతా తెలంగాణ వచ్చిన తరువాత గ్రామాల్లో వచ్చిన మార్పులను గుర్తించాలి. తాగునీటికి లేక తల్లడిల్లిన స్థితి నుండి ఇంటింటికి నల్లా నీటితో పాటు ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్నాం. వనపర్తి జిల్లా అయింది .. లక్ష ఎకరాలకు పైగా సాగునీరు వస్తున్నది.

ఇక మెడికల్, ఇంజనీరింగ్, మత్స్య, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా 600 పడకల ఆసుపత్రి రూపుదిద్దుకుంటున్నది. విద్య, వైద్యం, కరంటు, రవాణ, వ్యవసాయం, ఉపాధి రంగాలు అన్నింటిలో అగ్రస్థానంలో నిలిచాం. వలస వెళ్లిన పరిస్థితి నుండి నేడు మన గ్రామాలకే వలస వచ్చే పరిస్థితికి తీసుకువచ్చాం. ఆసరా ఫించన్లతో గ్రామాల్లో ఉన్న వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృత్తి కార్మికులకు అండగా నిలుస్తున్నాం. పనిచేస్తున్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి. జరుగుతున్న అభివృద్ది కొనసాగించేలా కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలవాలి’ అని అన్నారు సింగిరెడ్డి.

 

Latest News

More Articles