Wednesday, May 1, 2024

విదేశీ పర్యటనకు బయలుదేరిన రాష్ట్ర మంత్రులు

spot_img

హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ది పై అధ్యయనం చేయడానికి  రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లు దక్షిణ కొరియా రాజధాని సీయోల్, సింగపూర్ లలో విదేశీ పర్యటనకు వెళ్లారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలలో ప్రతిష్టాత్మకంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన కేబుల్ బ్రిడ్జి, రోప్ వే, ట్యాంక్ బండ్ అభివృద్ధి, సుందరీకరణ తో పాటు మ్యూజికల్ ఫౌంటెన్, లేజర్ షో, జెయింట్ వీల్, వేవ్ పూల్ , వాటర్ రైడ్స్, వాటర్ గేమ్స్ లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు.

దీంతోపాటు కరీం నగర్ లోని మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్న ఇతర పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై అధ్యయనం చేయడానికి బోయినపల్లి వినోద్ కుమార్ తోపాటు రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇరిగెషన్ శాఖ అధికారులు , పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ వివిధ శాఖల ఉన్నతాధికారులు దక్షిణ కొరియాలోని సియోల్ నగరం, సింగపూర్ లకు వెళ్లారు.

ఆయా నగరాల్లో ఉన్న అధునాతన పరిజ్ఞానంతో రూపొందించిన పర్యాటక ప్రదేశాలను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయడానికి ఉన్నత స్థాయి  బృందం నేటి సాయంత్రం నుండి జులై 7 వ తేదీ వరకు విదేశీ పర్యటనకు బయలుదేరింది.

Latest News

More Articles