Thursday, May 2, 2024

నల్లగొండ జిల్లాను ఏడారిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వనరుల విషయంలో సోయిలేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నల్లగొండ దాహార్తిని, ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టేల్ పాండ్ ను దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని విమర్శించారు. కృష్ణా టేల్ పాండ్ నీటి చౌర్యంపై ఆయన స్పందించారు. నల్లగొండ జిల్లాలను ఏడారిగా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. జిల్లా మంత్రులు తాగిన మైకంలో ఉండి నిర్లక్ష్యం చేస్తున్నారా? అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి.

గత 60 ఏండ్లు కృష్ణా జిల్లాల్లో మన హక్కుల కోసం కొట్లాడకుండా జిల్లాను కరువు కొరల్లోకి నెట్టారని ఆరోపించారు. ఫ్లోరోసిస్ కాంగ్రెస్ పాపం వల్లే వచ్చింది. హామీలకు మొసపోయి కాంగ్రెస్‌కి ఓటేస్తే ప్రభుత్వం టేల్‌పాండ్ నీటి చౌర్యానికి గురవుతున్నది. దీనికి జిల్లా మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. నీటి చౌర్యం పై విచారణ జరిపి ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

కృష్ణా నీటి దోపిడీ ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేస్తే ప్రజాలను కరువులోకి నెట్టారు. హామీలు నెరవేర్చడం పక్కకు పెడితే ఉన్న అవకాశాలను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టేల్ పాండ్ నీటి విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 22 నుంచి మే 10 వ‌ర‌కు కేసీఆర్ బ‌స్సు యాత్ర‌

Latest News

More Articles