Thursday, May 2, 2024

ఏప్రిల్ 22 నుంచి మే 10 వ‌ర‌కు కేసీఆర్ బ‌స్సు యాత్ర‌

spot_img

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ బ‌స్సు యాత్ర ప‌ర్మిష‌న్‌పై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ నాయ‌కులు కే వాసుదేవా రెడ్డి ఇవాళ(శుక్ర‌వారం) క‌లిశారు. ఈ మేర‌కు బ‌స్సు యాత్ర వివ‌రాల‌ను వికాస్ రాజ్‌కు వాసుదేవా రెడ్డి అంద‌జేశారు. యాత్ర‌కు సంబంధించి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. యాత్ర‌కు పోలీసుల స‌హ‌కారం అందించేలా చూడాల‌ని కోరారు. ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా, ప్ర‌శాంతంగా జ‌రిగేలా చూడాల‌ని వాసుదేవా రెడ్డి కోరారు.

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌ షోలుంటాయని, పార్టీకి అనుకూలంగా ఉండే రూట్‌మ్యాప్‌ను, ప్రదేశాలను నాయకులే కూర్చొని నిర్ణయించాలని నిన్న జ‌రిగిన బీఆర్ఎస్ మీటింగ్‌లో కేసీఆర్ సూచించారు. రోడ్‌షోలు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఉంటాయని, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయని తెలిపారు. బస్సుయాత్రలు చేస్తూనే మధ్యలో బహిరంగ సభల్లో కూడా పాల్గొంటానని చెప్పారు. సిద్దిపేట, వరంగల్‌ సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని బహిరంగ సభలు ఉంటాయన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయాలని కోరారు కేసీఆర్.

ఇది కూడా చదవండి:భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు

Latest News

More Articles