Friday, May 3, 2024

కిషన్ రెడ్డి కి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు

spot_img

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..సికింద్రాబాద్ లో గెలిచే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి ప్రజలకు నివేదిక పేరిట ఓ పత్రాన్ని విడుదల చేశారు. కేంద్రం నుంచి పదేళ్లలో 10లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కు ఇచ్చిందని కిషన్ రెడ్డి అంటున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి 46 వేల కోట్ల రూపాయలు తెచ్చానని కిషన్ రెడ్డి బీరాలు పలుకుతున్నారు. ఆ 46 వేలు కోట్లు తెస్తే ఎక్కడైనా పనుల రూపం లో కనిపించాలి కదా…అన్ని నిధులు తెస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో  ఒక్క సీటు కూడా బీజేపీ ఎందుకు గెలవలేదు. రైల్వే స్టేషన్ లో లిఫ్టులు, పంపులు ప్రారంభించి కుర్ కురే ప్యాకిట్లు పంచడం తప్ప కిషన్ రెడ్డి ఏం సాధించారని ప్రశ్నించారు.

ఓటమి భయంతోనే కిషన్ రెడ్డి నివేదికలంటూ ప్రజలను భ్రమల్లో పెడుతున్నారన్నారు రావుల శ్రీధర్ రెడ్డి. బీ ఆర్ ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలకు బీజేపీ నిధులు ఇవ్వలేదన్నారు. కిషన్ రెడ్డి గాలి సమీక్షలకు అధికారులు ఎందుకు వస్తారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదు. విభజన చట్టంలోనీ హామీలను ఏవీ బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి ఒక్క రూపాయి తీసుకురాలేదు. రాజ్యాంగ పరంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా కిషన్ రెడ్డి బీజేపీ అకౌంట్లో వేసుకుంటే ఎలా అని అడిగారు.

మొన్నటి ఆసెంబ్లీ లో ముగ్గురు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. కేంద్రం నుంచి నిధులు తెస్తే వారు ఎందుకు ఓడిపోయారు. కిషన్ రెడ్డి తనకు తాను క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ని అని చెప్పుకుంటే ఎలా ? బీఆర్ ఎస్ అభ్యర్థి పద్మారావుకు కూడా క్లీన్ ఇమేజ్ ఉంది అని తెలిపారు రావుల శ్రీధర్ రెడ్డి. తనకు కేసీఆర్ గౌరవం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అంటున్నారు. తెలంగాణకు గౌరవం ఇవ్వని కిషన్ రెడ్డికి కేసీఆర్ గౌరవం ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు ప్రజల్లో లేని కిషన్ రెడ్డి ఇపుడు ఎన్నికలు ఉన్నాయని బయలు దేరాడు.కిషన్ రెడ్డి ఎన్ని రిపోర్టులు ఇచ్చినా ఆయన అసలైన రిపోర్టు ప్రజల దగ్గర ఉంది. ఆయనకు ఈ ఎన్నికల్లో సరైన ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 22 నుంచి మే 10 వ‌ర‌కు కేసీఆర్ బ‌స్సు యాత్ర‌

Latest News

More Articles