Thursday, May 2, 2024

క్షమించండి నేను అయోధ్యకి రాలేను.. మోహన్ బాబు సంచలన లేఖ

spot_img

మరికొన్ని గంటల్లో భారీ భావోద్వేగ దృశ్యాలు కళ్ళముందుకు రాబోతున్నాయి. కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం అయోధ్యలో రాముడి గుడి ప్రారంభోత్సవ ఘట్టాలు నిజంకానున్నాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఎల్లుండి జరగబోతోంది. ఇలాంటి అద్భుత కార్యక్రమాన్నికళ్ళారా చూడాలని ప్రతి హిందువు భావిస్తారు. అయితే భద్రతా కారణాలతో కేంద్ర ప్రభుత్వం అతికొద్ది మందికి మాత్రమే రామమందిరానికి ఆహ్వానాలు పంపింది. తెలుగు రాష్ట్రలో చిరంజీవి, రామ్ చరణ్ లకు ఆహ్వానాలు అందగా.. తాజాగా తనకి ఆహ్వానం దక్కిందని స్వయంగా వెళ్లడించారు సినీ నటుడు మోహన్ బాబు.

అయోధ్య వేడుకకు తనకు కూడా ఆహ్వానం అందిందని మోహన్ బాబు చెప్పారు. అయితే, భద్రతా కారణాల వల్ల రాలేకపోతున్నానని, తనను క్షమించమని లేఖ రాశానని తెలిపారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక మోహన్ బాబు మరోవార్తని కూడా చెప్పారు. ఫిలిం నగర్ దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ గా తాను బాధ్యతలను స్వీకరించానని తెలిపారు మోహన్ బాబు. వెంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, షిర్డీ సాయిబాబా, లక్ష్మీనరసింహ స్వామి, సంతోషిమాత ఇలా 18 మంది దేవతామూర్తులు ఈ దేవాలయంలో కొలువై ఉన్నారని చెప్పారు. రామ మందిర ప్రారంభోత్సవం నాడు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామని మోహన్ బాబు తెలిపారు.

Latest News

More Articles