Friday, May 3, 2024

జూబ్లీహిల్స్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..!

spot_img

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వికలాంగులకు మూడువేల ఒక వంద 16 నుండి 4వేల ఒక్క వంద 16 రూపాయలకు పెన్షన్ ని పెంచడం చాలా చక్కని పరిణామం అని దానికిగాను కృతజ్ఞతగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న వికలాంగులు, బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసఫ్ గూడా చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు కనీసం దశాబ్ది ఉత్సవాలు అంటే ఏమిటో కూడా తెలియదు అని ఎద్దేవా చేశారు… చాలా ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలించిన వివిధ పార్టీలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించారు అని కానీ కెసిఆర్ హయాంలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వర్గ ప్రజలకు సంక్షేమ పథకాల వలన ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరుతుంది అని, బిఆర్ఎస్ పార్టీ నాయకులమైన తాము కేవలం అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల బాగు కోరుతాము అని వచ్చే ఎన్నికలలో తాము సంక్షేమ పథకాలని చూపెట్టి ఓట్లను అడుగుతాము అని తెలిపారు… తెలంగాణ ప్రజలు విజ్ఞులు అని కెసిఆర్ విశ్వసనీయత మళ్లీ ఒకసారి నిరూపించుకునే అవసరం ఏమీ లేదు అని కచ్చితంగా ప్రజలు బిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు, ఈ విషయం వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తుంది అని తెలిపారు..

Latest News

More Articles