Thursday, May 2, 2024

ఇది మళ్ళీ రిపీట్ కావొద్దు.. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ క్లాస్ ?

spot_img

కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో.. ఎంత చిల్లరగా ఉంటాయో ఉదాహారణలతో నేషనల్ మీడియా ఎండగడుతుంది. అధమస్థాయికి కాంగ్రెస్ దిగజారిందని అంటుంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏమో భారత్ జోడో న్యాయ యాత్రలో మాట్లాడుతూ.. అదానీని తిట్టని తిట్లు తిడుతుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అదానితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని కథనాలు ప్రచురించింది నేషనల్ మీడియా. కమిషన్ ఉంటే చాలు కంపెనీ ఏదైనా ఒక అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉంటుందని తెలుగు మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి.

మరి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న అదానీని రేవంత్ రెడ్డి దావోస్ లో కలవటం, ఆలింగనం చేసుకుంటూ వ్యాపార లావాదేవీలు మాట్లాడటం జరిగింది. రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిని హిందీ మీడియా గట్టిగా ప్రశ్నించింది. రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకునే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదానీతో కలిసిపోయాడా అని ప్రశ్నిస్తుంది. ఇండియాలో ఏమో అదానీ, మోడీ అంతా దొంగలే అని అనటం.. విదేశాల్లో చేతులు కలపటం నీచరాజకీయమని మండిపడింది.

అయితే రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిపై ఏఐసిసి కూడా సీరియస్ అయిందని తెలుస్తుంది. రాహుల్ పర్మిషన్ తీసుకోకుండా అదానీని రేవంత్ రెడ్డి కలవటాన్ని తప్పు పట్టిందట. సొంత ఇమేజ్ కోసం పార్టీకి దేశవ్యాప్తంగా చెడ్డ పేరు తీసుకురావొద్దని క్లాస్ పీకారట. మోదీకి అత్యంత సన్నిహితుడైన అదానీతో మనం కలిసిపోతే ప్రజలు మనం చేసే విమర్శలని విశ్వసించరని.. పబ్లిసిటీ స్టెంట్స్ తగ్గించాలని..ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ కావొద్దని రేవంత్ కి గట్టి క్లాస్ పడినట్టు సమాచారం.

Latest News

More Articles